calender_icon.png 25 October, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

25-10-2025 12:22:43 AM

 సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్,అక్టోబర్24(విజయక్రాంతి):పది సంవత్సరాలు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజలు మోసపోయారని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఊదరగొట్టి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఆనాడైన ఈనాడైన ఇండ్లు నిర్మించి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. హుస్సేనీ పురా లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి లబ్ధి దారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ భాద్యులు షబానా మహమ్మద్,సమద్ నవాబ్, హనీఫ్,మీరజ్,మసుమ్,ఖలీల్,బషీర్,జాఫర్,ముల్కలా కవిత, అస్తపురం తిరుమల, ఊరడి లత తదితరులుపాల్గొన్నారు.