calender_icon.png 15 July, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ఆగస్టు వరకు సరిపడా ఎరువుల నిల్వలు సిద్ధం

15-07-2025 12:42:43 AM

రైతులు అవసరం మేరకు  మాత్రమే ఎరువుల కొనుగోలు చేయాలి

ఎరువుల నిల్వల పై  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, జూలై 14(విజయ క్రాంతి); పెద్దపల్లి జిల్లాలో ఆగస్టు నెలకు సరిపడా ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి కొరత లెదని, రైతులు అనవసర ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ప్రస్తుతం 9400 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మనకు ఆగస్టు నెలలో 10 వేల  మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని, ప్రస్తుతం మన దగ్గర ఉన్న యూరియా నిల్వలు ఆగస్టు మాసం వరకు సరిపోతాయని,ఆగస్టులో కూడా మనకి యూరియా సరఫరా ఉంటుందని,  కాబట్టి రైతులు ఆందోళన చెంది యూరియాని ప్రస్తుతం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని,

.జిల్లాకి కావల్సిన యూరియాను జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి  జిల్లాకు తెప్పించడం జరుగుతుందని,రైతులు ఆందోళన చెందకుండా ఉండాలని , ప్రస్తుతం యూరియా కొనుగోలు చేసి నిల్వ ఉంచడం వలన దానిలో ఉన్న నత్రజని ఆవిరి చెందుతుందని,  ప్రస్తుత డోస్ కి  అవసరం మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాల్సిందిగా  రైతులకు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.