15-07-2025 12:42:47 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జులై 14, (విజయ క్రాంతి) గేద, ఆవు పాల కంటే మేకపాలు ఎంతో శ్రే ష్టమైనవి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ నం దు మహిళా శక్తి క్యాంటీన్ లో మేకపాల విక్రయ స్టాల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులతో ముచ్చటించి మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా వారు విక్రయిస్తున్న ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
అనంతరం వారు ఇచ్చిన మేకపాలను త్రాగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశా ల కు వెళ్లే విద్యార్థులకు తప్పని సరిగా మేకపాలు త్రాగించాలని ఇవి ఎంతో శ్రేష్టమైనవి, స్వచ్ఛమైనవన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మేకలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో గేద, ఆవు పాలు లీటర్ రూ 80 వరకు ధర ఉన్నదని, అదే ధరకు మేకపాలు కూడా విక్రయించవచ్చ ని ఇవి ఎంతో ఆరోగ్యకరమని తెలిపారు.
జిల్లాలోని రైతులు ముందడుగు వేసి లీటర్ నుండి ప్రారంభించి నప్పటికీ రైతులకు రూ 3000 నుంచి 4000 అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. ఈ మేకపాలను విక్రయించడం ప్రారంభించడం ద్వారా జిల్లాలో సంవత్సరానికి రూ 50 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. జిల్లాలో మేకల పెంపకానికి పశు గ్రాసానికి అనువైనదన్నారు. నగరాల్లో మేకపాలతో పన్నీరు,
ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని మన ప్రాం తంలో కూడా వీటిని వినియోగించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని రైతులు ఈ దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్లు ఆనందరావు, బాలకృష్ణ, రామకృష్ణ, సంతోష్, గోపాలమిత్ర సత్యనారాయణ , మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.