24 April, 2026 | 9:15 PM

ఓజోన్ ఆసుపత్రిలో సమ్మర్ క్యాంపు

24-04-2026 07:53 PM

ఎల్బీనగర్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఓజోన్ ఆసుపత్రి యజమాన్యం  సమ్మర్ క్యాంపు నిర్వహించడం శుభ పరిణామమని టీజీఎంసీ చైర్మన్ డాక్టర్  మహేష్ కుమార్, టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్ ఖీల్లా మైసమ్మ దేవాలయం సమీపంలోని  ఓజోన్ ఆసుపత్రిలో సమ్మర్ క్యాంపును ఓజోన్ ఆసుపత్రి చైర్మన్ సత్యసాయి ప్రసాద్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఓజోన్ ఆసుపత్రి సీవోవో డాక్టర్ హిత అభిలాష్ కలపాల తదితరులు ప్రారంభించారు.

వేసవికాలంలో సామాజిక సేవను దృష్టిలో ఉంచుకొని ఓజోన్ ఆసుపత్రి యజమాన్యం ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమని  కొనియాడారు. ఈ క్యాంపులో దాదాపు మూడు నెలల పాటు కొన్ని ప్రత్యేక వైద్యం చికిత్సలకు 50 శాతం డిస్కౌంటుతో అత్యాధునిక వైద్య సేవలను అందించనున్నామన్నారు.  మహిళల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గైనకాలజికి సంబంధించిన చికిత్సలకు 50 శాతం డిస్కౌంట్ మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందన్నారు.

ఏప్రిల్ 24 నుంచి జూలై  24వ తేదీ వరకు సమ్మర్ క్యాంపులో ప్రత్యేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.  సామాజిక సేవలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం ఆసుపత్రి ప్రాంగణంతోపాటు ఎల్బీనగర్, కొత్తపేట, ఉప్పల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, పాదాచారులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ రవీందర్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.