9 May, 2026 | 8:09 PM

విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి

09-05-2026 07:01 PM

ప్రధానోపాధ్యాయులు శేరిపల్లి శ్రీనివాసులు

దేవరకొండ,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల సమ్మర్ క్యాంప్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ పట్టణంలోనీ పిఎంశ్రీ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాలలో ప్రత్యేక వేసవి శిబిరాన్ని శ్రీయుత ఎం మాత్రూ నాయక్ మండల విద్యాధికారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాసులు  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల తేదీ 11-5-2026 నుండి తేదీ 25-5-2026 వరకు (15 రోజులపాటు)ఈ శిబిరం కొనసాగుతుందనీ, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు శిక్షణా తరగతులు నిర్వహించబడతాయనీ తెలిపారు.

5వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం 6 నుండి9వ తరగతి లో చేరబోయే విద్యార్థులందరూ  ఈ శిక్షణకు అర్హులే అని తెలిపారు. విద్యార్థులు కేవలం చదువే కాకుండా ఇతర సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా చిత్రలేఖనం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సంగీతం, నృత్యం, విద్యార్థులకు ఉల్లాసాన్నిచ్చే ఆటలు, పాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మానసిక ప్రశాంతత కోసం యోగా లాంటి  వివిధ కార్యక్రమాలకు  ఈ క్యాంపులో శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ఈ శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ప్రతిరోజు పౌష్టికాహారం (స్నాక్స్) ప్రభుత్వము అందజేస్తుంది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సమ్మర్ క్యాంపును విజయవంతం చేయగలరని   కోరారు