05-05-2025 01:47:32 AM
గురుకుల సెక్రటరీ అలగు వర్షిణి
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఈ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఆదివారం సమ్మర్ క్యాంపులను ఆమె సందర్శించి మాట్లాడారు..
ప్రతీ విద్యార్థికి శిక్షణనంతరం సర్టిఫికెట్ ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదించేందుకు ఈ క్యాంపులు ఎంతో దోహదపడతాయన్నారు. మొత్తం 238 గురుకుల విద్యాసంస్థల నుంచి 1,176 మంది విద్యార్థులు ఈ వేసవి శిబిరంలో శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు.