05-05-2025 01:46:15 AM
మెదక్, మే 4(విజయక్రాంతి):హవేళీ ఘణపూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాయలంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గౌడ సంఘం నాయకులు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు యామిరెడ్డి, సుభాష్ రెడ్డి, కిష్టా గౌడ్, సాప శ్రీనివాస్, కాయితీ దాసు, అరిగే పోచయ్య. గ్రామ గౌడ సంఘం నాయకులుపాల్గొన్నారు.