25-09-2025 12:10:09 AM
ఆదిలాబాద్, సెప్టెంబర్ 24(విజయక్రాం తి) : పత్తిని అమ్ముకునే రైతులందరికీ ‘కపాస్ కిసాన్ యాప్’పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్ డౌన్‌లోడ్, పత్తి కొనుగోలు కార్యాచరణ ప్రణాళికపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతోసమావేశం నిర్వహించి కలెక్టర్, ఎస్పీలు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025--26 సంవత్సరంకు సంబందించిన పత్తి కొనుగోలు కార్యాచరణ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయుటకు కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
‘కపాస్ కిసాన్‘ మొబైల్ యాప్ ద్వా రా పత్తి రైతులకు సులభమైన విక్రయ ప్రక్రియ అని అన్నారు. రైతులు తమ పత్తిని మద్దత్తు ధరకు విక్రయించాలంటే ఈ యాప్ ద్వారా ముందుగా నమోదు చేసుకోవడం అవసరం అన్నారు. రైతులు వెంటనే కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ వివరాలతో నమోదు చేసుకోవాలని కోరా రు. ఇది రైతులకు పారదర్శకంగా, వేగంగా, సురక్షితంగా పత్తి విక్ర యించే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.
జిల్లా లో 5 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 4,31,042 ఎకరాలల్లో33.47 లక్షల క్వింటాళ్లు పత్తి పంట సాగు చేయబడుతుందని అంచనా వేయడం జరిగిందన్నారు. 11 సీసీఐ సెంటర్‌లు, 36 జిన్నింగ్ కేంద్రాల్లో రోజుకు సగటున 10, 490 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. సీసీఐ మార్గదర్శకాల ప్రకారం పత్తి పంటను క్వింటాలుకు రూ. 7521ల కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
రైతు లు ఆధార్ ప్రామాణికం కావున వెంట ఉం చుకోవాలని, ఓటీపీ, QR కోడ్, బయోమెట్రిక్ లను వినియోగించుకోవాలన్నారు. అన్ని మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులు, పశువుల కోసం తాగునీరు ఏర్పాటు చేయాలనీ, మరుగు దొడ్ల మరమ్మతులు అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు.
అగ్ని మాపక శాఖ అధికారులు అన్ని జిన్నింగ్ మిల్లులను సందర్శించి అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలను అందించాలని, సంబంధిత సం స్థలకు తదనుగుణంగా సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, డీఎస్పీ జీవన్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి గజనంద్, సంబంధిత అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.