6 July, 2026 | 3:08 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

స్కిల్ వర్సిటీకి మద్దతు ఇవ్వండి

16-06-2025 01:14 AM
  1. కేంద్రమంత్రి జయంత్‌చౌదరిని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
  2. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ఐటీఐలకు అనుసంధానిస్తామని వెల్లడి
  3. ఐటీఐ సిలబస్ అప్‌గ్రేడ్‌కు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
  4. సీఎం నివాసంలో భేటీ అయిన కేంద్రమంత్రి

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం  ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి నివాసంలో ఆయనతో కేంద్రమంత్రి స మావేశమయ్యారు.

ఈసందర్భంగా రాష్ర్టం లో వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి జయంత్ చౌదరి సూచించారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉపయో గపడుతుందని పేర్కొన్నారు. తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివ ర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి.. దానిని ఐటీఐలకు అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి తెలియ జేశారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి అభినందించారు. ఐటీఐలన్నింటికీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కేంద్రమంత్రి సీఎంను కోరారు. ఐటీఐల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పా టు చేయాలని సీఎం వెంటనే అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లు కాలానుగుణంగా ఐటీఐల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని..

ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశిం చారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, సీఎంవో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.