12-05-2025 03:23:49 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు
హనుమకొండ, మే 11 (విజయ క్రాంతి): వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని కోనాపురం సమీపంలో వర్ధన్నపేట పాక్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగుపాటుకు బీహార్ రాష్ట్రానికి చెందిన బిట్టు విన్ అనే వలస కూలి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో చెట్టు క్రిందికి తలదాచుకోవడానికి వెళ్లగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మృతదేహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి తక్షణ సహాయంగా 15000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
అనంతరం వర్ధన్నపేట వేంకటేశ్వర తండా చెందిన మూడు గణేష్ పిడుగుపాటుకు గురై పట్టణం కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో అతన్ని పరామర్శించి డాక్టర్ల తో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి తరలించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పనిచేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన వలస కార్మికుని మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. వలస కార్మికులు మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. ఇలాంటి విషాదకర సంఘటన జరగడం దురదృష్టకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను. వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మార్వో విజయ సాగర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.