08-09-2025 02:55:54 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): యువజన కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు కోరుకొప్పుల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కామినేని ఆసుపత్రి(Kamineni Hospitals) వారి సహకారంతో బండరామరాం గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొని వారి ఆరోగ్య సమస్యలను, కామినేని ఆసుపత్రి నుండి వచ్చిన డాక్టర్లు వరుణ్, డాక్టర్ శ్రీకర్, ఆమెతి సుల్తానా వద్ద చూపించుకోవడం జరిగిందని తెలిపారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ముందు ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలకు ముందు ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మడ్డి కృష్ణమూర్తి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కొమ్ము జోహార్ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి, యువజన కాంగ్రెస్ తుంగతుర్తి మండల ఉపాధ్యక్షుడు బొంకురి రంజిత్, మండల యువజన కాంగ్రెస్ నాయకులు దుశెట్టి శ్రీకాంత్, మిట్టగడుపుల నవీన్, సాయి, అశోక్, గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.