calender_icon.png 13 November, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్

29-07-2024 07:50:37 PM

పాట్నా: బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ లో రిజర్వేషన్లపై పట్నా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. పాట్నా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వబోమని స్పష్టం చేసింది.  ప్రభుత్వం ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ గతేడాది నితీశ్  సర్కారు చట్టాన్ని తయారు చేసింది.

అయితే, దాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్ల పెంపును రద్దు చేసింది. దీంతో పాట్నా హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడా ధర్మసనం ఈ కేసుపై  విచారణ సోమవారం చేపట్టింది. 65 శాతం రిజర్వేషన్ల కోటాపై తాత్కాలిక ఆదేశాలు ఏమీ ఉండవని పేర్కొంది. సెప్టెంబర్ లో ఈ పిటిషన్లను విచారిస్తామని కోర్టు వెల్లడించింది.