18-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 17: కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ ఉత్తర్వుల విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలియజేయాలంటూ నటుడి తరఫు న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు విచక్షణాధికారం ఉపయోగించిన తీరుతో తాము ఏకీభవించలేకపోతున్నామని జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు.
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు కీలక సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలించాలని కపిల్ సిబల్ సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. అభిమాని రేణుకా స్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు డిసెంబర్ 13వ తేదీన కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఈ తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. తాజాగా సుప్రీం దీన్ని విచారించింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం హైకోర్టు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది