calender_icon.png 26 July, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజనను కొట్టేసిన సుప్రీం

26-07-2025 12:05:00 AM

- ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాలు పెంచాలని కోరిన పిటిషనర్ 

- 170 (3) ఆర్టికల్ ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కు పరిమితి ఉందని వెల్లడించిన కోర్టు

న్యూఢిల్లీ, జూలై 25: ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి 2022లో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కనబెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ 170 (3) ఆర్టికల్ ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కు పరిమితి ఉందని వెల్లడించింది. 2026లో మొదటి జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పింది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వ్యాజ్యాలు వరదలా వస్తాయని, వాటికి మనం గేట్లు తెరిచినట్టు అవుతుందని సుప్రీం అభిప్రాయపడింది.