22-10-2025 08:00:39 PM
సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత..
చిట్యాల (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని జనంపల్లి తెలంగాణ గురుకుల పాఠశాల, మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ బాలిక వసతి గృహలను బుధవారం మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. అక్కడ విద్యార్థులకి, కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి మధ్యాహ్న భోజన సదుపాయం ను వంటలను పరిశీలించారు. వసతి గృహం నందు విద్యార్దులు ఉపయోగించే వాష్ రూమ్, టాయిలెట్స్, డార్మెట్ హల్, క్లీనింగ్, అన్ని పరిశీలించి, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్సీ హాస్టల్ నందు కిచెన్, విద్యార్థులకి భోజన సదుపాయం, పడక గదులు, ప్రాంగణ పరిసరాల ప్రాంతాలు పరిశీలించారు. అనంతరం బీసీ బాలికల వసతి గృహం నందు ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ అడ్మిషన్ వివరాలు, విద్యార్థులకి కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల, పరిసర ప్రాంతాలు, వంట గది, డార్మెట్ రూమ్ లు పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ సభ్యులు బత్తుల గణేష్, నాగేష్, పాఠశాల సిబ్బంది, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.