18-10-2025 01:22:11 AM
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి టౌన్ అక్టోబర్ 17: వనపర్తి ప ట్టణ గుండా వెళ్లే ఈ రైలు మార్గం ద్వారా ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.సికింద్రాబాద్ డివిజన్లోని డోర్నకల్ , హైదరాబాద్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ మధ్య కొత్త లై న్ కు సంబంధించిన సర్వే పూర్తయినట్లు ఎ మ్మెల్యే తెలిపారు.డోర్నకల్ స్టేషన్ సికింద్రాబాద్ విజయవాడ లైన్ మరియు మర్రిపేట్ దక్షిణ మధ్య రైల్వే లో సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, సికింద్రాబాద్, సమీపంలోని శ్రీరాంనగర్ స్టేషన్ వరకు రైల్వే సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ రైలు మార్గం యొక్క సు మారు పొడవు 304 కిలోమీటర్లు ఉండబోతున్నట్లు నిర్మాణం పూర్తి సమయం సుమా రు ఐదు సంవత్సరాలు పట్టవచ్చునని ఆయ న తెలిపారు.ఈ రైల్వే లైన్ కోసం ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ డా. మల్లురవి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
రూ. 80 కోట్లుతో ఆర్‌అండ్‌బీ రోడ్లకు మహర్దశ
- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి టౌన్ అక్టోబర్ 17:వనపర్తి ని యోజకవర్గ పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ 80 కోట్ల నిధులు మం జూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.ఇందులో భాగంగా వనపర్తి నియో జకవర్గ పరిధిలోని వనపర్తి నుంచి గోపాల్పే ట ,బుద్ధారం గండి వరకు రోడ్డు పునరుద్ధరణకు రూ.51 కోట్ల 54 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.అదేవిధంగా వనపర్తి నుంచి ఆత్మకూరు రోడ్డు వ నపర్తి టు రాజపేట వరకు రూ.12 కోట్ల 82 లక్షలు మంజూరు అయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు.ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలి యజేశారు. ఇందుకు సంబంధించిన పను లు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎమ్మె ల్యే తెలిపారు.