calender_icon.png 18 October, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలి

18-10-2025 01:23:25 AM

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : పోడు పట్టాలున్న భూములకు పంట రుణాలు ఇవ్వాలని, అసైన్డ్ భూములకు పూర్తి పట్టా హక్కులు కల్పించాలని, కౌలుదారు సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రిని శుక్రవారం సచివాయలంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భూమి సునీల్ కుమార్, మెంబర్ సెక్రెటరీ గోపాల్,  ఏవో హరివెంకట ప్రసాద్ కలిశారు.  సంబంధిత శాఖ అధికారులతో కమిషన్ సమావేశం నిర్వహించిన విషయం శేషాద్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.