23-07-2025 12:00:00 AM
సిద్దిపేట క్రైమ్, జూలై 22 : మద్యం మత్తులో అజాగ్రత్త కారు నడిపి ఇద్దరి మృతికి కారకులైన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు త్రీటౌన్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. ఈనెల 20న సిద్దిపేటలోని సుభాష్ నగర్ కు చెందినసామలేటి పవన్ కుమార్, మిట్టపల్లి గ్రామానికి చెందిన కొమ్మిశెట్టి మణిసాయి అనే యువకులు మద్యం తాగి కారు నడుపుతూ మిట్టపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న తండ్రి, కూతురు మృతి చెందారు. మృతులు మంతోష్ కుమార్(23), ఝాన్సీ (4) బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అతివేగం, అజాగ్రత్తగా కారు నడిపి ఇద్దరి మృతికి కారకులైన మణిసాయి, పవన్ కుమార్ లను త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించిందని ఆయన తెలిపారు.