26-01-2026 09:17:04 PM
2 కోట్ల డి ఎం ఎస్ టి వీటి రోడ్ల నిర్మాణం
అభివృద్ధి పథంలో సుల్తానాబాద్ పట్టణం
40 కోట్ల రూపాయలతో సుల్తానాబాద్ నుండి పెద్దాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం
పట్టణంలో సెంటర్ లైటింగ్ తో శోభ
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో 15 కోట్ల రూపాయలతో నగర అభివృద్ధి పథకం లో భాగంగా 11వ వార్డు నుండి 15 వార్డు వరకు 6 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు డ్రైనేజీలు, కుల సంఘాల భవనాలు ప్రహరీ గోడల నిర్మాణాల కు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం రాత్రి భూమి పూజ శంకుస్థాపనలు చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయ రమణా రావు మాట్లాడుతూ... రానున్న రోజుల్లో సుల్తానాబాద్ పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దానని హామీ ఇచ్చారు.
మరో రెండు కోట్ల డిఎంఎఫ్టి నిధులను వెచ్చించి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దెల కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండల కేంద్రం నుండి పెద్దాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. పట్టణంలో సెంటర్ లైటింగ్ తో నూతన శోభను తీసుకువస్తానని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అందులో భాగంగా నూతనంగా ఏర్పడిన సుల్తానాబాద్ మున్సిపాలిటీలో సిసి రోడ్లు డ్రైనేజీలు బి టి రోడ్లతో కానుగు మట్టి అంటని కాలనీలుగా మార్చుతున్నామన్నారు.
గత పాలకులు 10 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని తాము అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తున్నామని పట్టణంపై సమతి తల్లి ప్రేమను చూపి పాత తాలూకా ఈ ప్రాంతంలో ఉన్న కార్యాలయాలను సైతం తరలించకపోయినా దౌర్భాగ్యపు పాలన గత ప్రభుత్వాన్ని అన్నారు. వీటితోపాటు డిఎం ఎఫ్.టి నిధులు 2 కోట్లతో మరింత అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రానికి అన్ని గ్రామాల నుండి డబుల్ రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తామని సెంటర్ లైటింగ్ తో పాటు సుల్తానాబాద్ చెరువు కట్టను 8 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్బండ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
పట్టణం అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన వారిని గెలిపించాలని మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్మన్నారు. అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, గాజుల రాజమల్లు, పన్నాల రాములు, వేగోళం అబ్బయ్య గౌడ్, సిద్ధ తిరుపతి, అమీరి శెట్టి రాజలింగం, తిరుపతి, కుమార్ కిషోర్,ఊట్ల రమ వరప్రసాద్, , బిరుదు సమత కృష్ణ, ఊట్ల వర ప్రదీప్, చింతల సునీత రాజు, గరిగే శ్రీనివాస్, దున్నపోతుల రాజయ్య, గాదాసు రవీందర్, ఈర్ల శేఖర్, తొర్రికొండ ప్రభాకర్, సముద్రాల విష్ణు, దున్నపోతుల మధు, ధన నాయక్ శ్రీనివాసరావు, గాజుల హరీష్, అమీనుద్దీన్ నన్ను, మేడి శ్రీనివాస్, న్యాతరి శ్యాంసుందర్, న్యాతరి దేవేందర్, లతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.