calender_icon.png 18 May, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

18-05-2025 02:41:21 PM

కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్..

కూకట్ పల్లి (విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్(Division Corporator Dodla Venkatesh Goud) అన్నారు. ఆదివారం ఆల్విన్ కాలనీ ఫేస్-2 కమ్యూనిటీ హాల్లో రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో బిపి, షుగర్ తో పాటు జనరల్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.

అనంతరం కార్పొరేటర్ వెంకటేష్ మాట్లాడుతూ... సామాన్య మధ్య తరగతి ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ముందుకురావాలని కోరారు. అనారోగ్యాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు ఉచిత వైద్య శిలాలను సద్వినియం చేసుకోవాలని పేర్కొన్నారు. వైద్య నిపుణులు అందిస్తున్న సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రామకృష్ణ రెడ్డి సృజనా రెడ్డి అమిత్, స్థానిక నాయకులు సమ్మారెడ్డి, వెంకటేష్ గౌడ్, పోశెట్టి గౌడ్, సురభి రమేష్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి, గోవర్ధన్, శ్రీశైలం, రఘు తదితరులు పాల్గొన్నారు.