13 May, 2026 | 2:11 AM

తగిన జాగ్రత్తలు తీసుకోండి

13-05-2026 12:30 AM

జిల్లా వైద్య అధికారి డాక్టర్ కృష్ణ

నవాబ్ పేట మే 12 : వేసవి నుంచి రక్షణ పొందెందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. మంగళవారం ప్రజా పాలనా-ప్రగతి ప్రణాళిక‘ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎన్మాన్ గండ్ల,రుద్రారం గ్రామాలలో వడ దెబ్బ నివారణ చర్యలలో భాగంగా ప్రజలకు,ముఖ్యంగా 259 మంది ఉపాది హామీ పథకము కూలీలకు వడ దెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించి 2132 ఓఆర్‌ఎస్ ప్యాకెట్ లు అందజేసినట్లు పేర్కొన్నారు. 

క్షయ నిర్ధారణ కార్యక్రమమును క్షయ నిర్ధారణ కొరకు ఆరోగ్య శిబిరములు నిర్వహించి 203 మందికి, ఎక్స్ రేలు, 25 మందికి తెమడ పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ కార్యక్రమము పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు.