02-08-2025 02:27:02 AM
జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): డెంగ్యూ నివారణపై భద్రతా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశిం చారు. డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం కమిషనర్ అధికారులతో కలిసి బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పరిశుభ్రత, దోమ ల నివారణ చర్యల అమలు పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
ముషీరాబాద్ సర్కిల్ 15లోని శ్రీ రాంనగర్ ప్రాంతంలో ఇటీవల నివేదించబడిన డెంగ్యూ పాజిటివ్ కేసు ఉన్న ఇంటిని కమిషనర్ సందర్శించారు. అక్క డి పరిసరాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ఎన్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ ఉన్నారు.