02-08-2025 02:25:48 AM
గూగూల్ క్లౌడ్ ఇండియాతో అవగాహన ఒప్పదం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఆసియాలో అతి పెద్ద విద్యా సంస్థలలో ఒకటైన నారాయణ విద్యాసంస్థ.. గూగుల్ క్లౌడ్ ఇండియాతో సాంకేతిక సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదు ర్చుకుంది. తాజా జనరేటివ్ ఏఐ, క్లౌడ్ పరిజ్ఞానంతో విద్యారంగంలో నూతన సంస్కర ణలు చేపట్టేందుకు, విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నారాయణ విద్యాసంస్థ గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
దీని ద్వారా విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అద్భుతమైన ఫలితాలు సాధించేలా విద్యను అందించడంలో ఈ ఒప్పం దం ఓ మైలురాయిగా నిలుస్తుంది. నారాయ ణ సంస్థ గూగుల్ క్లౌడ్ యొక్క అప్డేటెడ్ లా ర్జ్ లాంగ్వేజ్ మోడల్స్- జెమినీ 2.5 ప్రో, జె మినీ ఫ్లాష్‌లను వెర్టెక్స్ ఏఐ ద్వారా వినియోగించబోతున్నారు. దీని ద్వారా ప్రతి విద్యార్థి అవసరాలకు అనుగుణమైన సౌకర్యవంతమైన లెర్నింగ్ సిస్టమ్స్ అభివృద్ధి చేయబడ తాయి.
గూగుల్ క్లౌడ్ ఆధునిక ఏఐ టెక్నాలజీతో విద్యారంగంలో కొత్త సాధనాలు అభి వృద్ధి చేయటానికి అవసరమైన సాంకేతిక మద్దతును అందిస్తుంది. నారాయణ విద్యాసంస్థల అధ్యక్షుడు పునీత్ కొత్తప మాట్లాడు తూ.. ‘ప్రతి విద్యార్థి ప్రత్యేకం. అందుకే అతని చదువూ ప్రత్యేకంగా ఉండాలి. ఈ భాగస్వా మ్యం ద్వారా నారాయణ డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకి అవసరమైన విధంగా ఏఐ ద్వారా సహాయం అందించబోతున్నామన్నారు.