02-08-2025 02:27:08 AM
కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ జ్యోస్న
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): పొగ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నదని, అప్రమత్తత, ముందస్తు జాగ్రత్తలే ఆయుధమని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ జ్యోస్న తెలిపారు. ఊపిరితిత్తుతు కాన్సర్ డే సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడు తూ.. “ఊపిరితిత్తుల్లో నియంత్రణ లేకుండా పెరిగే కణాలు క్యాన్సర్‌గా మారతాయి.
ఇవి కణితులుగా మారి ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించగలవు. ఇది ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించబడుతుంది. నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఇది సుమారు 85శాతం కేసుల్లో కనిపిస్తుంది. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందే తీవ్రమైన రూపం. ఇందుకు ధూమపానం ముఖ్యకారణమైనా, ఇది పొగ తాగని వారిని కూడా ప్రభావితం చేయొచ్చు.
ఇతరుల పొగను పీల్చడం, వాయు కాలుష్యం, రాడాన్ గ్యాస్ లేదా అస్బెస్టాస్కు గురికావడం, కుటుంబంలో క్యాన్సర్ ఉండటం, విషపూరిత రసాయనాల పొగతాగడాన్ని ఎప్పుడు ఆపినా, ప్రమాదం తగ్గే అవకాశముంది.
నిరంతరంగా వచ్చే దగ్గు, దగ్గులో రక్తం రావడం, ఊపిరాడకపోవడం, ఛాతీ నొప్పి, అనుకోకుండా బరువు తగ్గడం, అలసట, గొంతు మారడం లక్షణాలేమైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. పొగ తాగడం మానేయాలి. క్యాన్సర్‌కు శస్త్రచికిత్స (సర్జరీ), కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కాంబినేషన్ థెరపీ, ప్యాలియేటివ్ కేర్ చికిత్సలు ఉన్నాయి” అని తెలిపారు.