20-08-2025 01:53:07 AM
రూ. 4.5 లక్షల విలువ గల18 కిలోల గంజాయి, 2 మొబైల్స్ ఫోన్‌లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి
ముషీరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): మహారాష్ట్ర ఔరంగబాద్ కు గంజా యి తరలిస్తున్న ఓ మహిళతో పాటు యువకుడిని దోమల గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో అదనపు డీసీపీ బి. ఆనంద్, గాంధీనగర్ ఏసిపి ఎ. యాదగిరి, దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ మహారాష్ట్ర ఔరంగబాద్‌కు చెందిన కోమల్ సోమినాధ్ వరుసకు కొడుకు అయ్యే సాహి ల్ మహేష్ సాలుంకే తో కలిసి గంజా యి వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం ఉద యం లిబర్టీ చౌరస్తా సమీపంలోని అంబేద్కర్ కాలనీ లోని సూరజ్ టూల్స్ అండ్ ట్రావెల్స్ ఎదురుగా అనుమానాస్ప దంగా లాగేజ్ బ్యాగులతో ఉండగా, దోమల గూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించరించడంతో అసలు విషయం బయటపడి ందని తెలిపారు.
విజయవాడలో బాబు అనే వ్యక్తి నుండి గంజాయి కిలో రూ.18 వేల చొప్పున 4.5 లక్షలు విలువ చేసే18 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. గత కొంత కాలంగా ఔరంగబాద్ లో ఈ గంజాయిని అధిక ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. గంజాయి విక్రయించిన బాబు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. గంజాయితో పాటు,
రెండు మొబైల్ ఫోన్స్ సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిసిపి శిల్పవల్లి వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో దోమలగూడ ఎస్సై కే.శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది సాయి కుమార్, ఎండి ఖలీల్, జె.సతీష్ కుమార్, ఆగా తాహిర్ అబ్బాస్, కుమార్, వీ.దుర్గా భవాని, హోంగార్డులు ఎస్.కె అబ్దుల్ ఖాదర్, జిలాని తదితరులు పాల్గొన్నారు.