calender_icon.png 24 September, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లెండేల్ విద్యార్థుల ప్రతిభ

24-09-2025 12:25:18 AM

ఐఎస్‌ఎస్‌ఓ తైక్వాండో నేషనల్స్‌లో బంగారు, వెండి పతకాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): సన్‌సిటీ, హైదరాబాద్‌లోని గ్లెండేల్ అకాడమీ విద్యార్థులు ముంబైలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఐఎస్‌ఎస్‌ఓ తైక్వాండో నేషనల్ ఛాంపియన్‌షిప్-2025 లో ఘన విజయాన్ని సాధించారు. ఈ నెల 21, 22 తేదీల్లో నితా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్‌లో జరిగిన పోటీల్లో గ్లెండేల్ నుండి ముగ్గురు విద్యార్థులు పాల్గొ ని మొత్తం ఆరు పతకాలు (మూడు బంగా రు, మూడు వెండి) సాధించారు.

రభ్యా వర్మ (గ్రేడ్ 8) అండర్-14 విభాగంలో రెండు బంగారు పతకాలు గెలిచి, వరుసగా రెండో ఏడాది డబుల్ గోల్ విజయాన్ని నమోదు చేసింది. సోదరుడు, -సోదరి జంట  ఐరా అలినా అహ్మద్ (గ్రేడ్ 5), ఆహిల్ అయాన్ అహ్మద్ (గ్రేడ్ 4) అండర్-11 విభాగంలో విశేష ప్రతిభ కనబర్చారు. ఐరా ఒక బంగా రు, ఒక వెండి పతకాన్ని, ఆహిల్ రెండు వెండి పతకాలను గెలిచారు. చిన్న వయసులోనే ఇంతటి ప్రదర్శనతో గ్లెండేల్ క్రీడా ప్రతిభ పెంపొందించే పాఠశాలగా మరింత పేరు తెచ్చుకుంది.

దేశవ్యాప్తంగా 61 పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో గ్లెండేల్ నుండి నలుగురు విద్యార్థులు మాత్రమే పోటీ పడి ఆరుగురు పతకాలు సాధించడం విశేషం. దీని ద్వారా గ్లెండేల్ అకాడమీ ఐఎస్‌ఎస్‌ఓ అచీవర్స్ బోర్డు 2025-26లో భారతదేశ టాప్ 10 పాఠశాలల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా గ్లెండేల్ అకాడమీ డైరెక్టర్ మిను సలోజా మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో రభ్యా, ఐరా, ఆహిల్ సాధించిన అద్భుత విజయాలు మాకు గర్వకారణం. వీరి కృషి, పోరాట స్ఫూర్తి గ్లెండేల్ విలువలను ప్రతిబింబిస్తున్నాయి అన్నారు.