24-09-2025 12:25:07 AM
ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి టౌన్ సెప్టెంబర్ 23: వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో అందుకు సానుకూలంగా స్పందించిన ఆ యన జిల్లా లోని విద్యాసంస్థ లన్నింటినికి సొంత భవనాల నిర్మాణానికి అనుమతులు ఇస్తూ అధికా రులకు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
గ తంలో కంటే నేడు కని విని ఎరుగని రీతిలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల పునరుద్ధరణ వసతి గృహాల అభివృద్ది, పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం, వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల సొంత భవనము,
తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల సొంత భవన నిర్మాణానికి మరియు మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల సొంత భవన నిర్మాణాలకు త్వరలోనే ఆదేశాలు జారీ కాకున్నాయన్నారు. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.