calender_icon.png 20 September, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలలో కుకునూరు విద్యార్థుల ప్రతిభ

20-09-2025 07:15:27 PM

వేల్పూర్ (విజయక్రాంతి): వేల్పూర్ మండలస్థాయి అంతర పాఠశాలల క్రీడోత్సవాలలో భాగంగా ఉన్నత పాఠశాల కుకునూరు విద్యార్థులు పాఠశాలకు పీఈటి లేకున్నా ఉపాధ్యాయుల సహకారంతో చక్కని క్రీడా ప్రతిభను చాటి రెండు షీల్డ్లు గెలుపొందినట్లు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ టి.హరిచరణ్ తెలిపారు. బాలికల జూనియర్ వాలీబాల్ ద్వితీయ బహుమతి, బాలుర సబ్ జూనియర్ వాలీబాల్ లో ద్వితీయ బహుమతి పొందినట్లు ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు. రెండు షీల్డ్ లు గెలుచుకొని గ్రామంలోకి వచ్చిన విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని గ్రామాభివృద్ధి కమిటీ డప్పులతో ఊరేగింపుగా ఎదుర్కోలు జరిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పతాని  గంగాధర్,జి. రవీందర్ శ్రీధర్ రావు, మల్కన్నా, అశోక్, నాగరాజు, హరిత, ప్రసాద్ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ర్యాడ మల్లేష్, సభ్యులు గోజూరి ఎర్రన్న, గోపి, నీరటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.