20-09-2025 07:15:02 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సర్కారు, ప్రైవేటుతో పాటు అన్ని మేనేజ్మెంట్లపరిధిలోని స్కూళ్లకు ఈ నెల 21 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకూ సెలవులు కొనసాగుతాయి. విద్యాసంస్థలు సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలిచ్చారు. కాగా, పలు యూనివర్సిటీలు సోమవారం నుంచే హాలీడేస్ ప్రకటించాయి. జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు సెలవులు కొనసాగనున్నాయి. సెలవల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బస్సు స్టేషన్లలో జనం తండోపతండాలుగా ఉన్నారు. బస్సులో ప్రజలు కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. రద్దీ కనుగుణంగా ఆర్టిసి అధికారులు బస్సుల సౌకర్యం కల్పించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.