29-11-2025 01:25:41 AM
నవంబర్ 30న పరీక్ష, 6 నుంచి 10వ తరగతి వారికి అవకాశం
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 28 (విజయక్రాంతి) : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు, వారిలో పోటీతత్వాన్ని పెంచేందుకు ‘ఆర్బీ ఐఐటీ నీట్ అకాడమీ’ ముందుకొచ్చింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘టాలెంట్ టెస్ట్- 2025’ను నిర్వహించనున్నట్లు అకాడమీ నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 30న ఆదివారం ఈ పరీక్ష జరగనుంది.
పూర్తిగా ఉచితం. ఈ టాలెంట్ టెస్ట్కు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితంగా ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఆఫ్లైన్ మరియు ఆన్లైన్.. రెండు విధానాల్లోనూ అందుబాటులో ఉంటుంది. సబ్జెక్టు లు: మ్యాథ్స్ ,సైన్స్ ,అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఆఫ్లైన్లో రాసే విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. సమయం: పరీక్ష వ్యవధి 2 గంటలు. ఆఫ్‌లైన్‌లో రాసేవారికి రెండు సెషన్లు అందు బాటులో ఉన్నాయి.
ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రాయాలనుకునే వారు www. meritstudents.com వెబ్‌సైట్ ద్వారా హాజరుకావచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదా ఇతర వివరాల కోసం 90305 65621 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.