calender_icon.png 29 November, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42% అమలు చేసేదాకా వెంటాడుతాం

29-11-2025 01:28:49 AM

కాంగ్రెస్ బీసీలకిచ్చిన హామీని నెరవేర్చాలి

  1. బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య
  2. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలి
  3. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం
  4. గన్‌పార్క్‌లో బీసీ నేతల భారీ నిరసన ప్రదర్శన

ముషీరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతం అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడుతామని, అంతవరకు ఉద్యమాన్ని కొన సాగిస్తామని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కాంగ్రె స్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌చేశా రు. రిజర్వేషన్లను అమలు చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలని హితవుపలికారు.

శుక్రవారం బీసీ జేఏసీ ఆధ్వ ర్యంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద వందలాది మందితో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్‌కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ ముదిరాజ్ నాయకత్వంలో భారీ  నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించే విషయం చర్చిస్తామని, త్వరలో ప్రధానమంత్రిని కలిసి ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరుతామని చెప్పారు. 76 ఏండ్లుగా బీసీలకు అన్యాయం జరిగిందని, ఇంకా అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు స్టే ఇవ్వకపోవడం విచారకరమన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం చేసిందని, కామారెడ్డి డెక్లరేషన్ చేశారని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ముద్రించారని గుర్తుచేశారు. ప్రతి ఎన్నికల సభలో వాగ్దానం చేశారు. 42 శాతం కల్పిస్తూ రాజ్యాంగ బద్ధంగా జీవో నంబర్ 9 జారీ చేశారని, బీహార్ ఎన్నికలు ముగియగానే చడీచప్పుడు కాకుండా రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతం తగ్గిస్తూ మరో జీవో నంబర్ 46 జారీ చేయడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు.

జీవో 46 కారణంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని హితవుపలికారు.

ఈ భారీ ప్రదర్శనలో జాతీ య సంక్షేమ సంఘం కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ అరుణ్‌కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కొండా దేవన్న, భూమన్నగౌడ్, సీ రాజేందర్, జీ అనంతయ్య, మోదీ రాం దేవ్, బాణాల అజయ్, లింగం యాదవ్, రాజు నేత, శివకుమార్, అంజిగౌడ్, నిఖిల్, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.