29-11-2025 01:06:41 AM
సర్పంచ్‌గా చిన్నపటోళ్ల సునందను, వార్డు సభ్యులను ఎన్నుకున్న గామస్తులు
నాగిరెడ్డిపేట్, నవంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాసానిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చిన్నపట్లోళ్ల సునందను గ్రామస్తులు శుక్రవారం ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. సర్పంచి పదవికి పోటీదారులు ఉన్నప్పటికీ గతంలో పదవులు చేసినవారు మళ్లీ సర్పంచ్ పదవికి పోటీచేస్తే పోటీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందని భావించి గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రామంలోని అందరికీ సమ్మతమైన వ్యక్తి పెద్దపట్లోళ్ల కిషన్ రెడ్డి భార్య సునందను సర్పంచ్‌గా ఉండాలని ప్రజలు కోరారు. దీంతో గ్రామస్తులు మేరకు సునంద సర్పంచ్‌గా ఉండేందుకు అంగీకరించా రు. అలాగే గ్రామంలోని 8 వార్డులకు సభ్యులను కూడా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాగిరెడ్డిపేట మండలంలో మొట్టమొదటిసారి సర్పంచ్‌తో పాటు వార్డుసభ్యులు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఇదే మొదటిసారీ మొదటి గ్రామం.
పాలకవర్గం మొత్తాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల మండలంలోని పలు గ్రామాలు వారి బాటలో పయనించాలన్న ఆలోచనలో పడ్డారు. మాసంపల్లి గ్రామస్తులు పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని మండలానికి ఆదర్శంగా ఆగ్రామస్తులు నిలిచా రు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు కిషన్ రెడ్డి, అంజాగౌడ్, వరిగే విట్ట ల్, సంగయ్య, వెంకట్రాంరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి రామ గౌడ్, శశికాంత్ రెడ్డి, నర్సింలు, రత్నం, సామెల్, భిక్షపతి, దుర్గయ్య, బాబు, లింగయ్య, చంద్రయ్య, సంజీవులు, మహేందర్ రెడ్డి, సూర్య కుమార్, గంగయ్య, పెంటయ్య, సుధాకర్, పర్వయ్య, మల్లయ్య, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.