calender_icon.png 16 November, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్‌మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

16-11-2025 12:37:34 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రూ.కోట్ల విలువ చేసే ధాన్యం దారి మళ్లినట్లు గుర్తింపు 

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలు మిల్లు ల్లో రూ.కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచా రం. ఎంతోకాలంగా రైస్ మిల్లుల్లో ప్రభుత్వ ధాన్యానికి సంబంధించి అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

సిర్పూర్ టి మండలం సాయి బాలాజీ రైస్ మిల్‌లో రూ.4.5 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు పక్కదారి పట్టినట్లు గుర్తించా రు. కౌటాల మండలంలోని వెంకటేశ్వర రైస్ మిల్లులో రూ.3.5 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లించినట్లు గుర్తించారు. సాయి బాలా జీ మిల్లులో 17,275.97 క్వింటాళ్ల ధాన్యం, 43,190 బ్యాగులు లెక్కలకు దొరకలేదు. వెంకటేశ్వర మిల్లులో 13,424.20 క్వింటాళ్ల ధాన్యం, 33,560 ధాన్యం బ్యాగులు లెక్కకు దొరకకపోవడంతో అధికారులు లోతైన విచారణ చేపట్టారు.

దహేగాం మండలంలోని వాసవి మాడ్రన్ రైస్‌మిల్‌లో పీడీఎస్ బియ్యం మార్చి సీన్ ఆఫ్ క్రైమ్‌ను మార్చిన విషయంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది విచారణ చేపట్టారు. జిల్లాలో ఏక కాలంగా రైస్ మిల్లు లో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ తనీఖీల్లో టాస్క్‌ఫోర్స్ అండ్ విజిలెన్స్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి, డీఎస్పీ శేఖర్‌రెడ్డిల బృందాల ఆధ్వర్యం లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసం త లక్ష్మి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు రాజ్‌కుమా ర్, శ్రీనివాస్, ఎఫ్‌సీఐ మేనేజర్లు, తహసీల్దార్ రహీముద్దీన్ పాల్గొన్నారు.