17-07-2025 08:17:26 PM
మేడిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలనకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ అమర్ సింగ్, పార్టీ నాయకులతో కలిసి పిజ్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 14వ డివిజన్ లో గల ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి పేదవాడు సంతోషంగా ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు, ప్రతి ఒక్కరి జీవితం అభివృద్ధి బాటలోకి రావాలని ఒక్క కుటుంబం కూడా వెనుక పడకూడదనే లక్ష్యంతో ప్రతి పేద కుటుంబాలు తమకంటూ ఒక ఇంటి కళను సహకారం చేసుకొనే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు.