17-07-2025 08:28:43 PM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): రోగుల కష్టాలను, బాధలను తీర్చేది వైద్యులేనని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో అడ్వైజరి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాన్సువాడలో ప్రభుత్వ నిర్మించిన తర్వాత ప్రత్యేక శ్రమతో వైద్యులు కృషి వల్ల ఆసుపత్రికి మంచి పేరు వచ్చిందన్నారు. కాలక్రమేణ అవసరాల నిమిత్తం వంద పడకల మాత శిశు సంక్షేమ ఆస్పత్రి నీ నిర్మించుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి మంచి పేరు వచ్చిందన్నారు.
ఎన్నో అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఆస్పత్రి వైద్యులు సిబ్బంది చేసిన కృషివల్లే అవార్డులు వచ్చాయి. ఆస్పత్రిలోని కేవలం విషయంలో డెలివరీ, ఆపరేషన్, ట్రీట్మెంట్ విషయంలో కానీ వేరే ఇతర ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే బాన్సువాడ మాతాజీ సంక్షేమ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన సేవలందిస్తున్నారు. తాము మౌలిక సదుపాయాలు కల్పిస్తాము కానీ రోగుల కష్టాలని, బాధలను తీర్చేది వైద్యులేనని అన్నారు. ఆస్పత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి సుధీర్ఘ అనుభవంగాల వైద్యురాల లని అన్నారు. గతంలో పనిచేసిన ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆస్పత్రికి ఎన్నో ఆవార్డులు వచ్చాయన్నారు. అంబులెన్స్ కొరత ఉందని అడ్వైజర్ కమిటీ సభ్యులు తన దృష్టికి తేవడంతో కమిషనర్ తో మాట్లాడి తే సానుకూలంగా స్పందించారన్నారు.
గత ప్రభుత్వాలయంలో రూ.22 లక్షల నిధులతో అంబులెన్స్ ఇప్పించాను అన్నారు. 230 పడకల ఆసుపత్రి కి అవుట్ పోస్ట్ పెట్టించాలని కమిటీ సభ్యులు అడగగా జిల్లా ఎస్పీతో మాట్లాడి తే సానుకూలంగా స్పందించారన్నారు. ఆస్పత్రిలో గత ఆరు నెలలలో 348 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు నిర్వహించారని తెలిపారు. పేద ప్రజల దృష్టిలో నా దృష్టిలో ఆసుపత్రి ఒక దేవాలయం అని వైద్యులు దేవుళ్ళతో సమానమని అన్నారు. ఆస్పత్రిలో రోగులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, అసిస్టెంట్ కలెక్టర్ కిరణ్మయి, ఆస్పత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి, అడ్వైజర్ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
బాన్సువాడలో 1997 సం.లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించుకున్నాం
ఆస్పత్రి నిర్మించుకున్న తర్వాత ప్రత్యేక శ్రమతో ఆస్పత్రికి మంచి పేరు వచ్చిందని, కాలక్రమేన అవసరాల నిమిత్తం వందపడకల మాత శిశు సంక్షేమ ఆసుపత్రి కూడా నిర్మించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే మాత శిశు సంక్షేమ ఆసుపత్రికి మంచి పేరు వచ్చింది, అవార్డులు వచ్చాయి. ఆసుపత్రిలోని సేవల విషయంలో డెలివరీ, ఆపరేషన్, ట్రీట్మెంట్ విషయంలో కానీ వేరే ఇతర ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే మాత శిశు సంక్షేమ ఆసుపత్రి గాని ఏరియా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది అద్భుతమైన సేవలందిస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అంతేకానీ రోగుల కష్టాల్ని బాధలను తీర్చేది వైద్యులే అన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయలక్ష్మి సుదీర్ఘ అనుభవం గల వ్యక్తి కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో పని చేసిన అనుభవం కల వైద్యురాలు, అలాంటి డాక్టర్ విజయలక్ష్మి నాయకత్వంలో వైద్యులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారు.
ఇంత పెద్ద ఆసుపత్రికి చిన్న చిన్న ఇబ్బందులు రావడం సహజం, అలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలని చర్చించుకున్నాం. ఇదివరకు సూపరిండెంట్ గా పని చేసిన డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో కూడా ఆస్పత్రికి ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. అడ్వైజరి కమిటీ సభ్యులు లేవనెత్తిన సమస్య అంబులెన్స్ కొరత ఉందని దానికి సంబంధించి కమిషనర్ తో మాట్లాడాను సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో నా సొంత ఖర్చులు 22 లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ఇప్పించాను అని తెలిపారు. ప్రైవేట్ అంబులెన్స్ బెడద పోవాలంటే ఇంకొక అంబులెన్స్ అవసరం ఉంది, అడ్వైసరి సభ్యులు సలహా మేరకు ఇంకొక అంబులెన్స్ తెప్పించుకుంటున్నాం
ఈ ఆస్పత్రి చాలా పెద్దది, అన్ని ఎంసీహెచ్, ఏరియా ఆసుపత్రి డయాలసిస్తో కలిపితే 230 పడకల ఆసుపత్రి ఇంత పెద్ద ఆసుపత్రికి ఒక ఔట్ పోస్టు పెట్టించమని కమిటీ సభ్యులు అడిగారు. దానికి ఎస్పీ తో మాట్లాడగా సానుకూలంగా స్పందించారన్నారు. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ కూడా అందుబాటులో ఉంది. వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. గత ఆరు నెలలలో ఆసుపత్రిలో 348 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరిగాయి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మన ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. పేద ప్రజల దృష్టిలో, నా దృష్టిలో ఈ ఆసుపత్రి ఒక దేవాలయం, డాక్టర్లే దేవుళ్ళు అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కాపాడేది ఎమ్మెల్యేలు,మంత్రులు కాదు డాక్టర్లే ప్రాణాలు కాపాడుతారు. అలాంటి డాక్టర్లను గౌరవించుకుందామన్నారు. ప్రైవేట్ అంబులెన్స్ల సమస్య పోలీసు వారితో మాట్లా డి వారి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.