calender_icon.png 18 July, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

17-07-2025 08:22:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్మల్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు "ఈవ్ టీజింగ్, పోక్సో చట్టం"పై  నిర్మల్ రూరల్ ఎస్ఐ లింబాద్రిచే  అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరు క్రమం తప్పకుండా పోలీసులు తెలిపిన జాగ్రత్తలను పాటిస్తూ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే విధిగా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు. పోకిరీలు, జులాయిలు వేధిస్తే 1098 కి కాల్ చేయాలి.ప్రస్తుత పరిస్థితుల్లో  సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్ వస్తె జాగ్రత్త పడాలని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ మాట్లాడుతూ... పోలీస్ వారు చెప్పినట్లు నడుచుకొని మంచి అలవాట్లను అలవర్చుకొని ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరారు.