11-08-2025 01:06:49 AM
- 10 ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్రికెట్ ’లకు ప్రణాళిక
- టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికి గుర్తింపు ఇవ్వాలని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ ఐఎంఏ హాల్‌లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రధా న కార్యదర్శి తాళ్ల పెళ్లి జైపాల్ సమన్వయం తో, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి అ ధ్యక్షతన “తెలంగాణ క్రికెటర్స్ మీట్” నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)అవినీతిలో కూరుకుపో యిందని క్రీడాకారులు సహా అందరికీ తెలిసిపోయిందని, వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. రాష్ర్టవ్యాప్తంగా 10 ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్రికెట్’లను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. 2021 జూలైలో బీసీసీఐ ఇచ్చిన కొలాబరేషన్ ఆదేశాలను హెచ్‌సీఏ పాటించలేదని, బాంబే హైకోర్టు కంటెంప్ట్ ఆదేశాల ప్రకారం మార్చి 29, 2025న జరిగిన టీసీఏ చర్చలకు తుది రూపం ఇవ్వక పోవడం ద్వారా, హెచ్‌సీఏకు తెలంగాణ క్రికెట్ అభివృద్ధిపై శ్రద్ధలేదని స్పష్టం అవుతోందన్నారు.
ప్రస్తుతం టీసీఏ కొలాబరేషన్ కాకుండా మెంబర్‌షిప్ కోరుకుంటుందని, రాష్ర్ట క్రికెట్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజాప్రతిని ధులు ముందుకు వచ్చి టీసీఏకు గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ పొన్నాల జగన్, సమీ, ఎండీ. జాకీర్ హుస్సేన్, స్టీఫెన్, శరత్ యాదవ్, ఎండీ.మోహిన్, కలువల శివ, భాస్కర్, నవరసాన్, శశాంక్, పలువురు క్రికెట్ అభిమా నులు, సీనియర్ క్రికెటర్లు పాల్గొన్నారు.