calender_icon.png 14 August, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్న గాండ్ల సంఘం

11-08-2025 01:07:04 AM

నిజామాబాద్ ఆగస్టు 10: (విజయ క్రాంతి):  సిర్నాపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి  ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు  ఇందూర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేవిదంగా ఐక్యమత్యంతో అంచలంచెలుగా ఎదుగుతుందని అభినందించారు.

సంఘాల ద్వారా సామాజిక సమైక్యత పెంపొందుతుందని, గాండ్ల సంఘం తన సేవా కార్యక్రమాల ద్వారా మంచి మార్గదర్శిగా నిలవాలని ఆశిస్తున్నామన్నారు. గాండ్ల సంఘం అభివృద్ధికి నూతన కమిటీకి తన వంతు పూర్తి సహకారం ఉంటుంద‘ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని తన చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేయించారు. 

ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు నాగరాజు  బిజెపి జిల్లా అధ్యక్షులు  దినేష్ కులాచారి , కాంగ్రెస్ నాయకులు, నరాల రత్నాకర్ గారు, రాంభూపాల్ గాండ్ల సంఘం కార్యవర్గం ఉపాధ్యక్షులు ఆసోల్ల రాజేంద్ర గోపి, సెక్రటరీ కాసర్ల మోహన్, జాయింట్ సెక్రెటరీ సాయన్న, క్యాషియర్ హనుమండ్లు, గాండ్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.