calender_icon.png 2 August, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిపాల వారోత్సవాలు

02-08-2025 05:54:49 PM

మంచిర్యాల (విజయక్రాంతి): పట్టణంలోని అరకాల వాడ-2 అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్ చందన తల్లిపాల ఉపయోగాలు, శిశువుల ఆరోగ్యానికి అందివచ్చే పోషక విలువలపై అవగాహన కల్పించారు. తల్లి పాల ప్రాధాన్యతను వివరిస్తూ, గర్భిణీలకు సరైన పోషణ, తినుబండారాలపై సూచనలు అందించారు. ఈ నెల ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుందన్నారు. అశోక్ రోడ్ 3 అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ చందన తల్లిపాల విశిష్టతను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల ద్వారా గ్రామ స్థాయిలో తల్లి పాలపై అవగాహన పెరుగుతోందనీ అభిప్రాయపడ్డారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్ లు సురేఖ, భాగ్య లక్ష్మి, ఏఎన్ఎంలు సరిత, స్వప్న,  సహాయకురాలు గౌరీ, అనిత, తల్లులు, గర్భిణీలు, ఏఎల్ఎంసి కమిటీ మెంబర్స్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.