02-08-2025 05:58:01 PM
ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తలు వహించాలి..
ఎఫ్ బి ఎస్, పి ఎల్ బి ఎస్ పరీక్షలు ఉచితం..
డాక్టర్ శ్రీకర్..
హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎండి జనరల్ ఫిజీషియన్, డయోబెటాలజిస్ట్ డాక్టర్ మోడెపు శ్రీకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని శనివారం శ్రీరామ హాస్పిటల్(Sri Rama Hospital)లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ శిబిరానికి హుజురాబాద్ ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని, ఉచిత వైద్య శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసామన్నారు.
ఎఫ్బిఎస్, పిఎల్బిఎస్ ఉచిత పరీక్షలతో పాటు ప్రతి మంగళవారం ఉచితంగా ఓపి చూస్తామని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వర్షా కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, తాగే నీటిని వేడి చేసుకుని తాగాలని అన్నారు. నేటి సమాజంలో చాలామంది డయాబెటిస్తో బాధపడుతున్నారని, షుగర్ వ్యాధి గ్రస్తులు తప్పకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలని అన్నారు. షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగితే చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి నెలకోసారి షుగర్ పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అని అన్నారు. ఉచిత వైద్య శిబిరం ద్వారా సుమారు 150 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ ఆస్పత్రి యాజమాన్యం నంబి భరణి కుమార్, ముష్కే శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది సతీష్, , సునీత, ఐశ్వర్య, అంజలి, శిరీష, సంధ్య, దీపిక తదితరులు ఉన్నారు.