calender_icon.png 3 October, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి

03-10-2025 07:17:53 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన అవసరమని గాంధీ మెడికల్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఇండ్ల లిఖిత శ్రీ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మండలానికి చెందిన మేడికోలు నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలు తమకు అవగాహన లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారని వారికి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి విధి అని సూచించారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ఆమె వివరించారు. ప్రతి 40 సంవత్సరాలు దాటిన మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన టెస్టులు చేయించుకోవాలని ఆమె సూచించారు. అవగాహన సదస్సులో మండలానికి చెందిన మెడికోలు సంగ రవితేజ, సాయి దీపక్ వర్మ, కొత్త విఖ్యాత్ లు పాల్గొన్నారు.