21 March, 2026 | 7:10 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల వేతన కోతలు వెనక్కి తీసుకోవాలి

18-09-2025 08:22 PM

రెండు నెలల ఆలస్యం  తర్వాత కోత విధించడం అన్యాయం

మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టిజిటి), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పిజిటి), జూనియర్ లెక్చరర్ల (జేఎల్) వేతనాలను గతంలో మాదిరిగానే యథావిధిగా కొనసాగించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా(MD. Yakub Pasha) గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకుండా రెండు నెలల తర్వాత తాజాగా వేతనాలు విడుదల చేసిన ప్రభుత్వం, అందులో భారీ కోతలు విధించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తూ, నిరంతరం శ్రమిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల వేతనాల్లో ఈ కోతలు వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని యాకూబ్ పాషా వాపోయారు. ప్రభుత్వం జూనియర్ లెక్చరర్లకు ₹11,600, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ₹13,195, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ₹10,460 చొప్పున కోతలు విధించినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని, గతంలో మాదిరిగానే యథావిధిగా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు.