20-08-2025 02:03:57 AM
కూకట్‌పల్లి ఆగస్ట్ 19 (విజయక్రాంతి): బాలానగర్ మండల విద్యాధికారి (ఎంఈఓ ) పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారింది. కూకట్‌పల్లి మండల విద్యాధికారి కార్యాలయాన్ని తమ ఎంఈఓకు అప్పగించాలని కూకట్ పల్లి మండల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.
మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కూకట్ పల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్ పల్లి పరిధిలోగల మండల విద్యాధి కార్యాలయం ఎదుట ఆందోళన చేశా రు. కూకట్ పల్లి మండలం కు చెందిన మండల విద్యాధికారి కార్యాలయంలో గత కొంత కాలంగా బాలనగర్ ఎం ఈ ఓ తిష్ట వేశారు. దీంతో కూకట్ పల్లి ఎం ఈ ఓ కు కార్యాలయం లేకుండా పోయింది.
కూకట్ పల్లి మండలానికి ఎం ఈ ఓ కార్యాలయం ఉండి కూడా లేనట్లే అయింది. కూకట్ పల్లి మండల పరిధిలోగల పాఠశాల విద్యార్థులకు ప్రభు త్వం అందించే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఉపాధ్యాయులకు అందించే బోధన సామాగ్రి, డిజిటల్ యంత్ర పరికరాలు పెట్టుకోవడానికి కార్యాలయం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ బిల్స్ రిటర్మెంట్ అయిన ఉపాధ్యాయుల సర్వీస్ బుక్స్ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కూకట్ పల్లి ఎం ఈ ఓ కార్యాలయానికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఎవరు అందుబాటులో లేకపోవడంతో డోర్ లాక్ అం టూ తిరిగి వెళ్లడం జరుగుతుందని ఉపాధ్యాయులు భ యాందోళనకు గురవుతున్నారు.
అదేవిధంగా మండల విద్యాధికారి విద్యా వ్యవస్థకు సంబం ధించిన ఏదైనా ఒక ప్రొసీడింగ్ తీయాలన్నా మండల పరిధిలో విద్యా వ్యవస్థ పై ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలన్న కనీసం కార్యాలయం లేకపోవడంతో ఉపాధ్యాయులు, ఎంఈఓ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
కూకట్ పల్లి మండల పరిధిలో గల ఎంఈఓ కార్యాలయం కూకట్ పల్లి అధికారులకు అప్పగించాలని మండలం లో ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. అయినా ఎవరు స్పందిం చకపోవడం తో ఉపాధ్యాయులు తమ నిరసనను తెలియజేశారు. ఇకనైనా బాలానగర్‌లోని ఎంఈఓ కార్యాలయా నికి సదరు ఎంఈఓను పంపించాలని డిమాండ్ చేశారు.