calender_icon.png 6 September, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు

06-09-2025 01:27:37 AM

  1. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ఉపాధ్యాయులకు సన్మానం

చండూరు, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం నల్ల గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో టీచర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లికంటి మా ట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు వచ్చే జీతంలో 75 శాతం పేద ప్రజల కోసం అందించేవారని గుర్తు చేశారు.

హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారని, బ్రిటి ష్ ఇండియాలో నైట్ హుడ్ అవార్డు స్వీకరించారని తెలిపారు. ఎంఈ వో వీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు సహజమని, ఎక్కడ ఉన్నా కూడా పాఠశాలల విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయా లన్నారు.

చండూరు మండలంలో ఎస్ ధోని పాముల నుంచి ఝాన్సీ, బోడంగిపర్తి నుంచి నాగమణి, కొండాపురం నుంచి భద్రయ్య, జడ్పీహెచ్‌ఎస్ చండూరు నుంచి జీవీ వెంకటేశ్వర్, జడ్పీహెచ్‌ఎస్ పుల్లెంల నుంచి ధర్మారావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనట్టు తెలిపారు.