21-08-2025 12:23:28 AM
పరిగి,ఆగస్టు -20( విజయ క్రాంతి )రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఐటి, విద్యా, టెలికం రక్షణ వాణిజ్య సంస్కరణలు ప్రవేశపెట్టారని, ఆయన ప్రవేశపెట్టిన సాంకేతిక విప్లవం పంచాయతీరాజ్ వ్యవస్థ, యువతకు అవకాశాలు కల్పించడంలో చూపిన దృక్పథం నేటికి ప్రేరణ ఇస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ని పురస్కరించుకొని పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. రాజీవ్ గాంధీ భారతదేశానికి ఆధునికతకు నాంది పలికిన దూరదృష్టి కలిగిన నాయకుడని,దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకువెళ్లడానికి చేసిన కృషి మరువలేమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆయూబ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శశికళ, దోమ మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదవ రెడ్డి, అభిరాం పంతులు, కుడుముల వెంకటేష్, చిన్న నరసింహులు, ఆంజనేయులు, సర్వర్, మహిపాల్, ఆనంద్, యాదయ్య, నరేందర్, తదితరులుపాల్గొన్నారు.