21-08-2025 05:39:08 PM
మంథని ఐసిడిఎస్ సిడిపిఓ ఉప్పులేటి పుష్పలత
రామగిరి (విజయక్రాంతి): గర్భిణీలు బాలింతలు శిశువులు ఆధార్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని మంథని ఐసిడిఎస్ సిడిపిఓ ఉప్పులేటి పుష్పలత(CDPO Uppuleti Pushpalata) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డి డబ్ల్యూ ఓ వేణుగోపాల్ ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీలకు బాలాంతలకు ప్రత్యేక ఆధార్ సెంటర్ క్యాంపును గురువారం ప్రారంభించారు. మూడు రోజులపాటు ఈ క్యాంపును శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సిడిపిఓ పుష్పలత తెలిపారు. ఇందులో ఫేస్ రీ గ్నైజేషన్ ఆధార్ కార్డు అప్డేట్ లేనివారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గర్భిణీలు మహిళలు బాలంచలు, చిన్నారి లను ఈ ఆధార్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మల్యాల భాగ్య తదితరులు పాల్గొన్నారు.