calender_icon.png 21 August, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళుడికే నా ప్రాధాన్యత: టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్

21-08-2025 05:31:59 PM

హైదరాబాద్: తమిళనాడులోని మధురైలో టీవీకే పార్టీ అధ్యక్షుడు, తమిళ నటుడు విజయ్(TVK Party President Vijay) సారథ్యంలో భారీ బహిరంగా సభ చేపట్టారు. ఈ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నటుడు విజయ్ మాట్లాడుతూ... తమిళనాడులో ప్రతి ఇంటి తలుపు తడతాం.. ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతానని అన్నారు. కులం కాదు.. మతం కాదు.. తమిళుడికే నా ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మనల్ని ఎవరూ ఆపలేరని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామని తెలిపారు. తక్కువ అంచనా వెయొద్దు.. అధికారంలోకి వచ్చి తీరుతామని వెల్లడించారు. మా రాజకీయ శత్రువు డీఎంకే.. మా భావజాల శత్రువు బీజేపీ అని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ముందు మనం ఎందుకు తలవంచాలి..? అని, మోదీ(PM Modi) పాలనపై టీవీకే అధ్యక్షుడు విజయ్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్యే పోటీ అని.. తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షలు తగ్గిస్తున్నాయని ఆరోపించారు. కచ్చ దీవులకు శ్రీలంక నుంచి స్వేచ్చ కల్పిస్తామని, స్టాలిన్ దిల్లీలో రహస్య సమావేశాలు జరుపుతున్నారని అన్నారు. మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నయని, స్టాలిన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని పేర్కొన్నారు.