calender_icon.png 21 August, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న ఫోన్ అందజేత

21-08-2025 05:37:20 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తికి చెందిన అమ్మిగల్ల అనిల్ అను వ్యక్తి తన రెడీమి నోట్ 10 ఫోన్ ను బొమ్మకల్ గ్రామంలో పోగొట్టుకొని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వండం జరిగింది. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి(CI Niranjan Reddy) ఆదేశాల మేరకు ఫోన్ ను సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా పెద్దపల్లిలో ఉన్నదని కనుక్కొని రికవరీ చేసి, గురువారం నాడు రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి ఆ ఫోన్ ను సంబంధిత యజమాని అయిన అనీల్ కు అప్పగించారు. ఈ సందర్బంగా ఫోన్ ట్రేస్ చేయడంలో కృషి చేసిన కానిస్టేబుల్ విశ్వతేజను రూరల్ సీఐ ప్రత్యేకంగా అభినందించారు.