29-08-2025 05:19:36 AM
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌కి అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరుతున్నట్లు మాజీ మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ప్రతి పక్షపార్టీగా వాస్తవాలను ప్రజలు ముందు ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
గురువారంబీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు వివేక్, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లా డుతూ. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను వాడుకుని బీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయ త్నం ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు. నివేదికను ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై స్పీకర్‌ను కలిసిం దుకు వస్తే.. అందుబాటులో లేరన్నారు. ఉద యం ఫోన్ చేస్తే మాట్లాడిన స్పీకర్.. ఆ తర్వాత ఫోన్ ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ కార్యదర్శిని కలిసి వినితిపత్రం ఇవ్వాలనుకుంటే ఆయన స్వీకరించడలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే మీడియా ముందుకు వచ్చి విషయా లు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2022లో 25 లక్షల క్యూసెక్కులు, 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిటారుగా నిలబడిందని, ఈ సీజన్‌లోనూ లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నా ప్రాజెక్టుకు ఏమీ కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ. 94 వేల కోట్లు అయితే.. లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సీల్డ్ కవర్‌లో ఉండగానే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ బహిరంగంగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు.