29-08-2025 05:04:56 AM
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో వరద బాధితులను పరామర్శించి వస్తుండగా కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుపడ్డారు. బండి సంజయ్‌ను చూడగానే ఆయన కాన్వాయ్ వద్దకు కేటీఆర్ వచ్చారు. వాహనం దిగి వచ్చి బండి సంజయ్ ఆయనకు అభివాదం చేశారు. బాగున్నారా? అంటూ ఒకరికొకరు పలకరించుకున్నారు. కష్టపడుతున్నావంటూ కేటీఆర్ ఈ సందర్భంగా బండి సంజయ్‌ని అభినందించారు. తర్వాత కేటీఆర్ నర్మాలకు వెళ్లారు.